కొత్త వార్డెన్లొచ్చారు..
● షెడ్యూలు కులాల వసతి గృహాల్లో నియామకం ● జిల్లాలోని 8 ఖాళీలకు ఏడు పోస్టులు భర్తీ
నిర్మల్‌చైన్‌గేట్:షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సంక్షేమ అధికారుల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2022, డిసెంబర్ 25 నోటిఫికేషన్ ద్వారా 2024 జూన్‌లో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ వసతిగృహాల సంక్షేమ అధికారుల ఉద్యోగాలు ఎంచుకున్న వారికి బాసర జోన్‌కు సంబంధించి నిజామాబాదులో కౌన్సెలింగ్ జరగగా నిర్మల్ జిల్లాకు ఏడుగురిని కేటాయించారు. జిల్లాలో 8 సంక్షేమ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండగా.. ఏడుగురు నియామకంతో పర్యవేక్షణ మరింత మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లాకు కేటాయించిన హెచ్‌డబ్ల్యూవోలకు బుధవారం నియామకపత్రాలు అందజేశారు. ఏడుగురిలో ఆరు పోస్టులను బాలుర వసతిగృహాలకు, ఒకరిని బాలికల వసతిగృహాల్లో నియమిస్తూ జాబితా సిద్ధం చేశారు.
జిల్లాలో 20 వసతి గృహాలు..
జిల్లాలో షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖకు సంబంధించి ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ కలిపి 20 వసతి గృహాలు ఉండగా.. 12 మంది మాత్రమే రెగ్యులర్ హెచ్‌డబ్ల్యూవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. హెచ్‌డబ్ల్యూవోలు లేని చోట ఇన్‌చార్జీలను నియమించారు. దీంతో వసతిగృహాల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తేవి. ఫలితంగా జిల్లా అధికారులే నిరంతరం పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇప్పుడు వసతి గృహాల్లో వార్డెన్ల నియామకం ద్వారా, అక్కడ విద్యార్థుల కోసం వసతి సౌకర్యాలు, విద్య, ఇతర సహాయం సమర్థవంతంగా అందించబడుతుంది.
హెచ్‌డబ్ల్యూవోలు వీరే..
వసతిగృహం హెచ్‌డబ్ల్యూవో
నర్సాపూర్(జి) టి.శ్రీనివాస్
దిలావర్‌పూర్ మురళి
లోకేశ్వరం పి.సుర్జిత్‌రెడ్డి
కుభీర్ ఆకాశ్‌రాథోడ్
బాసర సిరాజ్‌ఖాన్
కడెం ప్రకాశ్
నిర్మల్ బాలికల సౌమ్య


