నాన్న కల నెరవేర్చా.. | - | Sakshi
Sakshi News home page

నాన్న కల నెరవేర్చా..

Apr 30 2025 12:42 AM | Updated on Apr 30 2025 12:42 AM

నాన్న

నాన్న కల నెరవేర్చా..

● మూడో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా మనోగతం

కై లాస్‌నగర్‌: ‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మ రింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆ నందానిచ్చింది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు ఆదిలాబాద్‌ జిల్లా కు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్‌ సలో ని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.

సాక్షి: ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌.. వెల్‌కమ్‌ టు ఆదిలాబాద్‌. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు..

ట్రెయినీ కలెక్టర్‌: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్‌, అమ్మ సీమ. ఇద్దరూ గురుగ్రాంలోనే బిజినెస్‌ చేస్తుంటారు. అన్న దక్ష్‌. గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.

సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..

ట్రెయినీ కలెక్టర్‌: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్‌లో నిర్వహించే డిబేట్‌లు, ఎక్స్‌ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్‌, ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ ఎకానామిక్స్‌ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్‌ పరీక్షలపై దృష్టి సారించాను.

సాక్షి: యూపీఎస్సీ కోచింగ్‌ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..

ట్రెయినీ కలెక్టర్‌: పదో తరగతిలోనే ఐఏఎస్‌ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్‌ కావాలనే నా సంకల్పంతో పాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్‌ నిమిత్తం ఆదిలాబాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించాను.

సాక్షి: సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా..

ట్రెయినీ కలెక్టర్‌: సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

నాన్న కల నెరవేర్చా.. 1
1/1

నాన్న కల నెరవేర్చా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement