అవకాశం ఇస్తామని మాట తప్పారు..
మేము 2017 నుంచి 2019 వరకు భైంసా పీహెచ్‌సీలో ఆశా కార్యకర్తలుగా ఔట్ సో ర్సింగ్ విధులు నిర్వర్తించాం. ఆ రెండు సంవత్సరాలు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. 2019 నుంచి మమ్మల్ని విధులకు హాజరు కావద్దన్నారు. ప్రభుత్వం నుంచి పోస్టులు మంజూరైతే మొదటి ప్రాధాన్యత మాకే ఇస్తామని చెప్పారు. ఇటీవల ఆయా పోస్టుల్లో వేరే వారిని నియమించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పోస్టులు మాతోనే భర్తీ చేయాలి.
– సుజాత, నీరజ, భైంసా
నాభూమి నాకు ఇప్పించాలి
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో 103 సర్వే నంబర్‌లో నాకు 120 సెంట్లభూమి ఉంది. నాకు తెలియకుండా మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నా సంతకం లేకుండానే అట్టిభూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇదే విషయం అధికారులను అడిగితే ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను నా భూమిని ఎవరికీ అమ్మలేదు. నాభూమి నాకు ఇప్పించాలి.
– ఎరుకల లక్ష్మి, ఓలా, కుంటాల
అవకాశం ఇస్తామని మాట తప్పారు..


