రైతులకు ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ప్రత్యేక గుర్తింపు

Apr 22 2025 12:09 AM | Updated on Apr 22 2025 12:09 AM

రైతుల

రైతులకు ప్రత్యేక గుర్తింపు

నిర్మల్‌

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నిరవధిక సమ్మె

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు.

8లోu

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

తప్పకుండా చేయించుకోవాలి

పైఅధికారుల ఆదేశాలమేరకు ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా ఏవోలకు ఏఈవోలకు శిక్షణ పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌లో రైతులు తమ వివరాలు కచ్చితంగా నమోదు చేయించుకోవాలి. 2025 జనవరి 1 కంటే ముందు ధరణిలో ఉన్న సమాచారం ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంది. రైతు ఆధార్‌ కార్డుకు తప్పనిసరిగా మొబైల్‌ నంబర్‌ లింకు ఉండాలి. ఆధార్‌ కార్డులో తెలుగు, ఇంగ్లిష్‌లో ఉన్న పేరు ఒకేలా ఉండాలి లేకపోతే యాప్‌ స్వీకరించదు. – అంజి ప్రసాద్‌, డీఏవో

నిర్మల్‌చైన్‌గేట్‌: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్‌తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈమేరకు ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ‘ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి ఈ ప్రక్రియను అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 15న జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులు హరికృష్ణ, విద్యాసాగర్‌ పాల్గొనగా, ఏప్రిల్‌ 19న నిర్మల్‌ అర్బన్‌ రైతు వేదికలో ఏఈవోలు, ఏవోలకు శిక్షణ అందించారు.

కార్డులో రైతు వివరాలు..

ఈ గుర్తింపు కార్డు రైతుల సమగ్ర వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తుంది. 11 అంకెల సంఖ్యతో రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, సారవంతం, పంటల అనుకూలత, బ్యాంకు రుణ అర్హత, సబ్సిడీలు, పీఎం కిసాన్‌ నిధులు, పంట నష్ట పరిహారం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇకపై రుణాల కోసం పట్టా పాస్‌బుక్‌, ఇతర పత్రాల అవసరం ఉండదు. కేవలం ఈ సంఖ్య చెబితే సరిపోతుంది.

ప్రత్యేక యాప్‌ ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తారు. ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో నమోదు కోసం వెళ్లాలి. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, రైతు ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా 11 అంకెల సంఖ్య కేటాయిస్తారు.

ప్రత్యేక యాప్‌లో నమోదు..

రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్‌ ద్వారా ఆధార్‌ కార్డు మాదిరిగా రైతులకు ప్రత్యేక కోడ్‌ ఉండాలనే ఉద్దేశంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ పథకం పీఎం కిసాన్‌, పంట బీమా, యాంత్రీకరణ సబ్సిడీలను సులభతరం చేస్తుంది. రైతులు సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, వేదికపై అదనపు కలెక్టర్‌, ఆర్డీవో తదితరులు..

న్యూస్‌రీల్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీతో కేంద్రం కొత్త పథకం ప్రత్యేక కార్టుల జారీకి చర్యలు ఆధార్‌ తరహాలో 11 అంకెల సాగుదారుల సంఖ్య ఇప్పటికే అధికారులకు శిక్షణ

రైతులకు ప్రత్యేక గుర్తింపు1
1/2

రైతులకు ప్రత్యేక గుర్తింపు

రైతులకు ప్రత్యేక గుర్తింపు2
2/2

రైతులకు ప్రత్యేక గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement