శాసీ్త్రయజ్ఞానం పెంపొందించుకోవాలి
● ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్ డాక్టర్ సాహెబ్‌రావు
కుంటాల: విద్యార్థులు శాసీ్త్రయజ్ఞానం పెంపొందించుకుని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్ డాక్టర్ సాహెబ్‌రావు సూచించారు. కుంటాల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి రహస్యాలను ఛేదించడం, కొత్త విషయాలను కనుగొనడానికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విద్య, విజ్ఞానం, జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని సూచించారు. అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్, మంగళయాన్ మిషన్ల ద్వారా భారతదేశానికి మంచి గుర్తింపు దక్కిందని తెలిపారు. విద్యార్థులు ఆదిశగా వెళ్లాలని కోరా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాసు నవీన్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


