‘తెలంగాణలో బుల్డోజర్ల ప్రభుత్వం’
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని ఎస్‌ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న నేపథ్యంలో మంగళవారం దిగంబర్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిగంబర్ మాట్లాడు తూ.. కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులకు యూనివర్సిటీ భూములను కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి వెళ్లనని ప్రకటిస్తూ.. యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని దిగంబర్ హెచ్చరించారు.


