బాధ్యతలు స్వీకరించిన రితీశ్ రాథోడ్
నిర్మల్‌చైన్‌గేట్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రితీశ్ రాథోడ్ ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కార్యాలయ రిజిస్టర్‌లో తొలి సంతకం చేశారు. అనంతరం బీజేపీ నేతలు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ సాగర్, అంకం మహేందర్, నల్లా రవీందర్‌రెడ్డి, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తీక్, సాయి కుమార్, మల్లేశ్, తోకల భూచన్న, పుప్పాల ఉపేందర్, కాశవేణి శ్రీనివాస్, వెంకటేష్, బొడ్డు కిరణ్, పిట్టల భూమన్న, కంతి లింబాద్రి, తిరుమల గిరి, ఇనుముల స్వామి, జీవన్ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న రితీశ్ రాథోడ్


