నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 26 2025 12:11 AM | Updated on Mar 26 2025 12:11 AM

నిర్మ

నిర్మల్‌

కానుకలు వద్దు.. నగదే ఇద్దాం
మంగళ్‌మోట్‌ ఆదివాసీ మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్లల వివాహాల సమయంలో కానుకలకు బదులు నగదు ఇవ్వాలని నిర్ణయించారు.
కూలీలందరికీ పని కల్పించాలి

బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025

8లో

ట్రాఫిక్‌రూల్స్‌ పాటించాలి

నిర్మల్‌టౌన్‌: వాహనచోదకులు, ప్రజలు ట్రాఫి క్‌ నియమాలు పాటించాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలో ని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులకు ట్రాఫిక్‌ నియంత్రణ, డ్రంకెన్‌డ్రైవ్‌ మిషన్లు పంపిణీ చే శారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫి క్‌ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సూచించారు. భైంసా, నిర్మల్‌ ఏఎస్పీలు అవి నాష్‌, రాజేశ్‌మీనా, ఏవో యూనస్‌ అలీ, ఇన్‌స్పెక్టర్లు అజయ్‌కుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, నైలు, గోపీనాథ్‌, ప్రవీణ్‌ కుమార్‌, కృష్ణ, మల్లేశ్‌, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌, శేఖర్‌, రామకృష్ణ, రమేశ్‌, ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

ధికారంలో ఏ ప్రభుత్వమున్నా.. ఏ పార్టీ పగ్గాలు చేపట్టినా.. జిల్లాకు అభివృద్ధి నిధులు, నేతలకు పదవులూ ఇవ్వడం లేదన్న వాదన పెరుగుతోంది. అభివృద్ధితోపాటు రాజకీయాల్లోనూ తమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా బడ్జెట్‌లలోనూ నిధులు రాలేదు. పక్కనున్న నిజామాబాద్‌ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరుముగ్గురికి రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్‌ నేతలకు ఎలాంటి పోస్టులు ఇవ్వడం లేదు. రాజకీయంగా చక్రం తిప్పిన జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.

– నిర్మల్‌

జిల్లాకు ఏమిచ్చారు..!?

తెలంగాణ ఏర్పాటు కావడం, జిల్లాగా ఆవిర్భవించడంతో ఇక నిర్మల్‌కు తిరుగుండదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. దీనికి తోడు నిర్మల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్‌రెడ్డికి రెండు పర్యాయాలు మంత్రి పదవి రావడంతో మరింతగా అభివృద్ధిపై ఆశలు పెరిగాయి. స్థానిక పాలకులు ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వాల నుంచి జిల్లాకు ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదు. మెడికల్‌ కాలేజీ కూడా జిల్లాకొకటి ఇవ్వడంలో భాగంగానే వచ్చింది. కానీ.. కచ్చితంగా నిర్మల్‌ జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీ కావాలని నిండుసభలో అప్పటి సీఎం కేసీఆర్‌ను అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అడిగితే, ఆయన నిర్మల్‌కు కాకుండా పక్కనున్న ఆదిలాబాద్‌కు కేటా యించడం చోద్యం. సాఫ్ట్‌వేర్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ ఊసే లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో వచ్చిన రెండు పరిశ్రమలు ప్రారంభమవుతాయన్న గ్యారంటీ లేకుండా పో యింది. పర్యాటక అభివృద్ధికి ఏ జిల్లాలో లేనన్ని అవకాశాలు నిర్మల్‌ జిల్లాలో ఉన్నా.. కనీసం ఆ దిశగా ఆలోచించిన సందర్భాలే లేవు. కళ్లముందే చా రిత్రక కట్టడాలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టింపులేదు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా జిల్లాలో కొత్తగా వచ్చిన అభివృద్ధి ఆనవాళ్లు ఒక్కటీ లేకపోవడం శోచనీయం.

మనోళ్లకు ఎందుకివ్వరు...!?

తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లాలో మళ్లీ పోస్టులపై చర్చ కొనసాగుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా జిల్లాపై చిన్నచూపు చూస్తారన్న వాదన పెరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపిస్తున్న కూచాడి శ్రీహరిరావుకు ఏదైనా ఒక పదవి దక్కుతుందని ఏడాదిగా చర్చకు వస్తున్నా.. పార్టీ అధి ష్టానం మాత్రం స్పందించడం లేదు. జిల్లాలో ఎంతోమంది సీనియర్‌ నేతలున్నా.. వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దగ్గ ర అని పేరున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకూ మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది.

జిల్లాపై చిన్నచూపు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై ఎప్పటి నుంచో చిన్నచూపు ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా నిర్మల్‌నూ అలాగే చూస్తున్నారు. అభివృద్ధికి నిధులివ్వడం లేదు. ఇక్కడి నేతలకూ పదవులు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా సమగ్ర అభివృద్ధికి సర్కారు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– ఎంసీ లింగన్న, నిర్మల్‌ సిటిజన్స్‌ఫోరం కన్వీనర్‌

బకాయిలు వసూలు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: శ్రీనిధి రుణ బకాయిలను గడువులోపు వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శ్రీనిధి రుణాలపై సమావేశం నిర్వహించారు. మండలాలవారీగా మహిళా సంఘాల సంఖ్య, మంజూరు చేసిన రుణాలు, ఇప్పటివరకు సంఘాలు చెల్లించిన బకాయిలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్‌, మెప్మా పీడీ సుభాష్‌, శ్రీనిధి ప్రాంతీయ సమన్వయకర్త సరిత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పక్కజిల్లాతో పోలిస్తే..

న్యూస్‌రీల్‌

అభివృద్ధి కోసం నిధులివ్వరు.. ఆశావహులకు పదవులివ్వరు.. పక్కజిల్లాకు నాలుగైదు పోస్టులు జిల్లాపై ఎప్పుడూ చిన్నచూపే.. రాజకీయ కేంద్రమైనా అనిశ్చితే..

రాజకీయంగా అదే దుస్థితి..

జిల్లా అభివృద్ధికి నిధులే కాదు.. ఇక్కడి నేతలకూ పదవులు ఇవ్వడం లేదన్న వాదన బలంగా ఉంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అల్లోలకు మంత్రి పదవి మినహా రాష్ట్రస్థాయిలో ఒక్క కార్పొరేషన్‌ పోస్టు కూడా ఇవ్వలేదు. పదేళ్లపాటు ఎంతోమంది సీనియర్‌ నేతలు నామినేటెడ్‌ పోస్టులపై పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అదే పరిస్థితి రిపీట్‌ అవుతోంది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క నామినేటెడ్‌ పోస్టు జిల్లాకు దక్కకపోవడం గమనార్హం.

గతంలో ‘సాక్షి’ చెప్పినట్లు ‘గంగదాటని పదవులు’ అన్నట్లు ఇప్పటికీ గోదావరి(గంగ) దాటడం లేదు. జిల్లాకు పక్కనే గోదావరి దాటగానే నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురు నేతలకు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఇదే నియోజకవర్గానికి చెందిన సుంకెట అన్వేశ్‌రెడ్డికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోస్టు దక్కింది. రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన మానాల మోహన్‌రెడ్డిది కూడా బాల్కొండ నియోజకవర్గమే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నా.. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి ముగ్గురికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చారు. ఇదొక్కటి చాలు.. జిల్లాపై ఉన్న చిన్నచూపునకు ప్రత్యక్ష ఉదాహరణ.

నిర్మల్‌1
1/3

నిర్మల్‌

నిర్మల్‌2
2/3

నిర్మల్‌

నిర్మల్‌3
3/3

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement