నిర్మల్‌ఖిల్లా: వడ్డెర కులస్తులంతా సంఘటితమై హక్కులు సాధించుకోవాలని భారతీయ వడ్డెర స మాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ మౌర్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. వడ్డెరుల పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించబడ్డా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీ జాబితాలోనే ఉంచి అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని సూచించారు. స మావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏత్తరి మా రయ్య, ప్రధాన కార్యదర్శి సంపంగి ప్రభాకర్, యువజన ఉపాధ్యక్షుడు ఒంటిపులి రాము, నా యకులు గురవయ్య, నర్సయ్య, గంగాధర్, ఎల్ల ప్ప, గంగారాం, శ్రీనివాస్, లక్ష్మణ్, బాజీరావు, శంకర్, ముత్యం, బంగారయ్య, మోహన్, పద్మారావు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.