ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో తేమశాతం తగ్గుతుంది. దీంతో మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది.
ఉద్యోగం ఇప్పించండి
నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. కాళ్లు పనిచేయవు. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఇటీవల మెడికల్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో వార్డు అటెండెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. నా వైకల్యాన్ని గుర్తించి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి. – సుంకే రాకేష్, నిర్మల్
రైతుబీమా రావడం లేదు..
మా నాన్న తడగొండ రాజన్న ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు కొత్తపేట మండలంలో ఖాతా నంబర్ 532లో వ్యవసాయ భూమి ఉంది. మరణానంతరం రావాల్సిన రైతుబీమా మంజూరు కాలేదు. గతవారం కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకున్నాను. వారం రోజులు అయినా ఫలితం లేకపోయేసరికి మరోమారు వచ్చాను. ఇప్పుడు అధికారులు మా నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ కవర్ కాలేదని.. బీమా రాదని చెబుతున్నారు. అధికారులు మా సమస్య పరిష్కరించి బీమా సొమ్ము అందజేయాలి.
– భవాని, కొత్తపేట, ఖానాపూర్
వాతావరణం