గణితం.. | - | Sakshi
Sakshi News home page

గణితం..

Feb 28 2025 1:19 AM | Updated on Feb 28 2025 1:17 AM

గణితం అంటే విద్యార్థులు భయపడుతారు. ప్రణాళిక ప్రకారం చదివితే గణితంలో సులువుగా మార్కులు సాధించవచ్చని నిర్మల్‌ జిల్లా పాత ఎల్లాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

వాస్తవ సంఖ్యలు: సంయుక్త సంఖ్యలను ప్రధాన కారణాంకల లబ్దంగా రాయడం, యూక్లిడ్‌ భాగాహార న్యాయం ఆధారంగా గాసాభా కనుగొనడం, ధన బేసి, సరిసంఖ్య రూపం, కరణీయ సంఖ్య అని చూపడం, సంవర్గమనం, లాఘరిథమ్స్‌ సమస్యలను ప్రాక్టీస్‌ చేయాలి.

సమితిలు: శూన్య, వియుక్త సమితి నిర్వచనాలు, సమితి నిర్మాణ, జాబితా రూపం రాయడం, వీటికి ఉదాహరణలు సమితి సమ్మేళనం, చేదనము సమస్యలను సాధించడం, వెన్‌ చిత్రాలను గీయడం ప్రాక్టీస్‌ చేయాలి.

బహుపదులు: బహుపది శూన్య విలువలు కనుగొనడం, గ్రాఫ్‌ నుంచి శూన్యాలను చెప్పడం, వర్గ, ఘన బహుపదుల శూన్యాలు కనుగొనాలి.

వర్గ సమీకరణాలు: విచక్షిని కనుగొని మూలాల స్వభావం చెప్పడం, ఆల్ఫా, బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం రాయడం, రాత సమస్యలకు వర్గ సమీకరణం రాసి గ్రాఫ్‌ ద్వారా శూన్యాలు కనుగొనాలి.

చర రాశుల్లో రేఖీయ సమీకరణాలు: సంగతా, అసంగతా, పరస్పర ఆధారిత సమీకరణాలు ఎలా అవుతాయి, వీటిని కనుగొనడం, సమీకరణాలను చరరాశిని తొలగించడం, ప్రతిక్షేపన పద్ధతి, గ్రాఫ్‌ పద్ధతుల ద్వారా సాధించాలి.

సరూప త్రిభుజాలు: ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి అనువర్తన సమస్యలు, సరూప త్రిభుజాలు నిర్మాణాలు గీయడం.

శ్రేడులు: అంక,గుణ శ్రేడుల్లో మొదటి పదం, సామాన్య భేదం, నిష్పత్తులను కనుగొనడం, అంక శ్రేడీలో N వ పదం, N పదాల మొత్తం సంబంధించి సమస్యలు సాధించాలి.

సాంఖ్యక శాస్త్రం: ముడి దత్తాంశం ఇచ్చి సగటు, మధ్యగతం, భాహులకాం కనుగొనడం, సగటు, మధ్యగతం, బాహులకం సూత్రం రాసి అందులో పదాలను వివరించాలి. వర్గీకత దత్తాంశానికి సగ టు, మధ్యాగతం, బాహులకం కనుగొనాలి. ఓజీవ్‌ వక్రాలను గీయడం వంటి వాటిపై సాధన చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement