● తానూరు మండలం బెంబర శివారులో గురువారం రాత్రి రైతు లచ్చన్న తన వ్యవసాయ పొలంలో ఆవులను కట్టివేసి ఇంటికి వెళ్లాడు. దూడపై చిరుత పులి దాడి చేసి, చెట్టుపైకి తీసుకెళ్లి చంపి తినేసింది. ఉదయం చేను వద్దకు వచ్చి చూడగా చెట్టుపై దూడ కళేబరం కనిపించడంతో చిరుత దాడిగా గుర్తించాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ బీట్ అధికారి మహేశ్ గ్రామానికి చేరుకుని చిరుత దాడిలోనే లేగదూడ మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
● మూడు నెలల క్రితం బెంబర –ఝరి(బి) ఆటవీ ప్రాతంలో చిరుత దాడి చేసి మేకను చంపి తినేసింది.
● మూడు నెలల క్రితం సారంగాపూర్ మండలం మలక్‌చించోలి గ్రామంలో చిరుత ఆవుపై దాడి చేసింది.
● నాలుగు నెలల క్రితం ముధోల్ మండలం రాంటెక్ గ్రామ శివారులో చిరుత పులి మేకపై దాడి చేసింది.
● 8 నెలల క్రితం మహలింగి శివారు ప్రాంతంలో గ్రామానికి చెందిన జంకోడ్ విఠల్ అనే రైతు వ్యవసాయ పొలంలో ఆవును కట్టివేశాడు. రాత్రి సమయంలో చిరుత ఆవుపై దాడిచేస్తున్న క్రమంలో అరుపులు విని అటువైపు వెళ్లేసరికి చిరుత అక్కడి నుంచి పారిపోయింది.
● గతేడాది అదే గ్రామానికి చెందిన హల్దా భోజ న్న రైతుకు చెందిన ఆవును హతమార్చింది.
● గతేడాది బామ్ని శివారులోని అటవీ ప్రాంతంలో బామ్ని గ్రామానికి చెందిన షేక్ హుసేన్‌కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. అటవీ శాఖ అధికారులు చిరుత పులిగా నిర్ధారించారు.
● గతంలో కుంటాల మండలం సూర్యపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఎడ్లబండిపై వెళ్తున్న ముగ్గురు రైతులకు చిరుత పులి కనిపించింది.