ఖనాపూర్‌లో బీఆర్‌ఎస్ ఫిర్యాదు
ఖానాపూర్: పట్టణంలోని 12 వార్డుల్లోని బోగస్ ఓట్లను ఏరివేయాలని బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఓటర్లను చేర్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖలీల్, ఖానాపూర్ మాజీ ఉపసర్పంచ్ సుమన్, నాయకులు సుమిత్, ఇర్ఫాన్, సతీశ్, వాహబ్, నసీర్, రవి, సొయబ్, రాజు, కళావతి, నవీన్ ఉన్నారు.


