● నిర్మల్ చేరిన ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం ● జాకీలతో
లిఫ్టింగ్.. షిఫ్టింగ్!
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో ఓ ఇంటిని కూల్చకుండా 5 అడుగుల ఎత్తుకు లేపుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతుండడంతో యజమాని హర్యానా నుంచి నిపుణులను పిలిపించారు. హైడ్రాలిక్ జాక్‌లు, స్టీల్ ఫ్రేమ్‌లతో ఇంటిని లిఫ్ట్‌చేసే పనులు జరుగుతున్నాయి. భవన పునాదికి జాక్‌లు అమర్చి మిల్లీమీటర్ స్థాయిలో సమతుల్యత కాపాడుతూ పైకి ఎత్తుతున్నారు. గోడలు, స్తంభాలకు పగుళ్లు రాకుండా పరిశీలిస్తున్నారు. లిఫ్టింగ్‌లోముందుగా భవన నిర్మాణ బలాన్ని పరీక్షించి, లోపల ఉండే గోడలు, స్తంభాలు, ఫౌండేషన్ సామర్థ్యాన్ని ఇంజనీర్లు విశ్లేషించారు. తర్వాత దశలవారీ ఎత్తడం, షిఫ్టింగ్‌లో ట్రాక్‌లపై కదలిక, కొత్త పునాదిపై అమర్చడం, సేఫ్టీ టెస్టులు జరుగుతున్నాయి. పాత భవనాల చారిత్రక విలువను కాపాడుతూ వర్షాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తున్న ఈ సాంకేతికత జిల్లా కేంద్రాల్లోకి చేరడం గొప్ప పరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి పరిష్కారాలు పెరిగే అవకాశం ఉంది. స్థానికులు ‘ఇంటికి ప్రాణం పోసినట్టు‘ అంటూ ప్రశంసిస్తున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు ఇల్లు మునిగిందని, మరో కాలనీలో తలదాచుకోవాల్సి వచ్చిందని యజమాని గుజ్జులవారి కిషన్ తెలిపారు. అందుకే ఐదు అడుగుల ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ.5 లక్షలతో ఇంటిని ఐదు అడుగులు పైకి ఎత్తినట్లు పేర్కొన్నారు. ‘ఏటా వర్షాకాలంలో ఇంట్లోకి వరద వస్తోంది. తమ కూతురు గర్భిణిగా ఉన్న సమయంలో ఇల్లు మునిగింది. అందుకే లిఫ్టింగ్ అవకాశం ఉందని తెలుసుకుని పనులు చేపట్టాం’ అని మరో ఇంటి యజమాని గంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
నేడు కోర్టు భవనానికి భూమిపూజ
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. హైకోర్టు జడ్జీలు సృజన, లక్ష్మణ్, నర్సింగ్‌రావుతోపాటు న్యాయవాదులు కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు.
● నిర్మల్ చేరిన ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం ● జాకీలతో
● నిర్మల్ చేరిన ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం ● జాకీలతో


