వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన
సారంగపూర్: మండలంలోని మలక్‌చించోలి గ్రామంలో ఆకిన్ అనలెటిక్స్ హైదరాబాద్ సేవాస్ఫూర్తి ఫౌండేషన్, జిల్లా వ్యవసాయ శా ఖల ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగుమందు ల పిచికారిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఆకిన్ అనలెటిక్స్ చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. డ్రోన్ ద్వారా ఎకరా పొలానికి 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో పురుగు మందులు, ఇతర మందులను పిచికారీ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. రైతులు ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మండల వ్యవసాయాధికారి వికార్‌అహ్మద్, స్థానిక సర్పంచ్ దాసరి విజయ, ఉపసర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యుడు నవీన్ ఉన్నారు.


