నిబద్ధతతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పోలీసులు విధులు మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏఆర్ కన్వర్షన్‌పై వచ్చిన 2013 బ్యాచ్ 7వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతనంగా నియామకం పొందిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకిత భావం ముఖ్యమన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.


