
పట్టుకున్న నగదుతో పోలీసులు
తలమడుగు(బోథ్): మండలంలోని లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.90 వేల నగదు పట్టుకున్నట్లు ఎస్సై ధనశ్రీ తెలిపారు. కిన్వట్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న మారుతి షిఫ్ట్ కారును తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న గంగాధర్ సీతారాం వద్ద రూ.90 వేల నగదు లభ్యమయ్యాయి. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్సై సురేందర్, రెవెన్యూ సిబ్బంది రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
బేల: మండలంలోని శంకర్‌గూడ గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో గురువారం నిర్వహించిన తనిఖీలో రూ.లక్ష నగదు పట్టుకున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. వైభవ్ అనే వ్యాపారి మహారాష్ట్రలోని కోర్పణ నుంచి పటాన్‌బోరికి కారులో రూ.లక్ష తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌టీ టీంకు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.