
దెబ్బతిన్న జొన్నపంట చూపుతున్న రైతు ఆనంద్
తాంసి: తాంసి, భీంపూర్ మండలాల్లో రెండు రోజులుగా ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన అండే అశోక్ అనే రైతుకు చెందిన మూడెకరాల జొన్నపంట బుధవారం రాత్రి కురి సిన వర్షానికి నేలకొరిగింది. ఎకరాకు దాదాపుగా 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని.. వర్షం కారణంగా పంట నేలకొరగడంతో నల్లబారుతోందని .. దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాడు. మరో రెండు రోజులు వర్షం ఇలాగే కురిస్తే నష్టం తీవ్రత పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.