నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన తమ్మరాశి భూమన్న బుధవారం ద్విచక్ర వాహనంపై లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి వెళ్లి వస్తుండగా అర్లి(కే )సమీపంలో కంకెట గ్రామానికి చెందిన సుధీర్ కుమార్ ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. భూమన్న సోదరుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై హన్మండ్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment