భైంసాటౌన్:అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో డివిజన్ పరిధిలో ఆదివారం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సంబరాలకు అనుమతి లేదని ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అలాగే 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రో డ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపుల కు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.