
పరోక్షంగా బరిలో..
ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు మహిళా నేతలకు పార్టీ టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీ కండువాలు మార్చి పరోక్షంగా ఎన్నికల బరిలో నిలిచారు.
10లోu
గురువారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2023
బావాబామ్మర్ది మోసం చేస్తున్నరు
– కూచాడి శ్రీహరిరావు
నిర్మల్ నియోజకవర్గంలో ప్రతీవిషయంలో ‘నువ్వు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్లు చేస్తా..’ అన్న తరహాలో బావాబామ్మర్ది ప్రజ లను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించిన ఆయన ఇలా మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగమైన ప్యాకేజీ 27, హైలెవల్ కెనాల్ పనులను వీరిద్దరూ అడ్డుకున్నారని, పనులు నత్తనడకన సాగేలా చేశారని మండిపడ్డారు. దిలావర్‌పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య పచ్చని పంటపొలాల్లోనూ వీరిద్దరూ కలిసే ఇథనాల్ ఫ్యాక్టరీ పేరిట చి చ్చుపెట్టారని ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్ అ మలుకు మంత్రి దొడ్డిదారిన జీవో 220 తీసుకువచ్చారని ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్‌పై నె లలపాటు పట్టించుకోని మహేశ్వర్‌రెడ్డి ఎన్ని కల ముందు దీక్ష అంటూ డ్రామా చేశాడని ఆరోపించారు. మున్సిపల్‌లో పారిశుధ్య కా ర్మికుల పోస్టులు అమ్ముకునే స్థాయికి బీఆర్‌ఎ స్ పాలకులు దిగజారారని దుయ్యబట్టారు. బావాబామ్మర్ది పీడ వదిలేలా నిర్మల్ నియోజకవర్గ ఓటర్లు తీర్పునివ్వాలని కోరారు.
● శ్రీహరిని గెలిపిస్తే నిర్మల్ అభివృద్ధి
● ఇన్నేళ్లు దోచుకున్న అల్లోల, ఏలేటి
● డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వమే..
● నిర్మల్ సభలో పీసీసీ చీఫ్ రేవంత్
● సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో ఫుల్‌జోష్

