కూలీలతో మాట్లాడుతున్న మహమూద్
సారంగపూర్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీ లకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం తాండ్ర (జీ) గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం రోజుకు రూ.100 నుంచి రూ.120 మాత్ర మే చెల్లిస్తోందని తెలిపారు. అవి కూడా ప్రతీవారాంతంలో వారి ఖాతాల్లో జస్తున్నారు. నెలల తరబడి చెల్లింపులు చేయడం లేదని వాపోయారు. దీంతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలోలాగా కూలీలకు ప్రభుత్వం పనిముట్లు పంపిణీ చేయకపోవడంతో అదనంగా కూలీలే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పనిముట్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో కూలీల సౌకర్యార్థం టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వెంటనే ప్రభుత్వం కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు శాంతికుమారి, రేణుక తదితరులున్నారు.


