మరేం పర్లేదు ..రచన : సీఎం యోగి | Yogi Adityanath Spots Nervous Speaker,His Next Move Draws Widespread Praise | Sakshi
Sakshi News home page

మరేం పర్లేదు ..రచన : సీఎం యోగి

Oct 7 2026 6:33 PM | Updated on Oct 7 2026 6:45 PM

Yogi Adityanath Spots Nervous Speaker,His Next Move Draws Widespread Praise

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తన కఠినమైన పాలనా శైలికే కాకుండా, కొన్నిసార్లు తన సున్నితమైన, మానవతా దృక్పథంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా లక్నోలో జరిగిన హెచ్‌సీఎల్ టెక్నాలజీ 10 ఏళ్ల వేడుకల వేదికపై చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభలో ప్రసంగిస్తూ ఓ యువతి భయంతో తడబడినప్పుడు..సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమెకు అండగా నిలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసి నేటికి పదేళ్లైంది. హెచ్‌సీఎల్ ఐటీ దశాబ్ది వేడుకల్ని పురస్కరించుకొని ఆ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా సీఎం యోగితో పాటు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు గోరఖ్‌పూర్‌కు చెందిన రచనా రాయ్ అవకాశం దక్కించుకున్నారు. భారీ జన సమూహం, ప్రముఖుల సమక్షంలో యువతి ప్రసంగం ప్రారంభించింది. రెండు మూడు నిమిషాల తర్వాత తడబాటు మొదలైంది. అటు సీఎం.. ఇటు ప్రజలు ఏం చేయాలో పాలుపోక ఒత్తిడికి గురైంది. ప్రసంగాన్ని కొనసాగించలేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  

సీఎం యోగి ఆప్యాయత..
వేదికపై రచనాయ రాయ్‌ మాటలు తడబడుతుండటాన్ని పక్కనే ఉన్న సీఎం యోగి గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెలో ఆత్మ విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ చప్పట్లు చరుస్తూ కనిపించారు. సీఎం స్పందన చూసిన ప్రేక్షకులు సైతం ఆమెకు అండగా నిలిచారు. పెద్ద ఎత్తున చప్పట్లతో ప్రోత్సహించారు. సీఎం యోగి చొరవ ఆ యువతికి సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఆ క్షణంలో తనలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకున్న ఆమె, మళ్లీ ప్రసంగాన్ని ధైర్యంగా కొనసాగించి సమర్థవంతంగా పూర్తి చేసింది.  

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఎక్స్‌  సహా పలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన నాయకత్వం అంటే ఇదే! పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం కంటే, సరైన సమయంలో ఒక చిన్న ప్రోత్సాహం అందిస్తే మనుషులు నిలదొక్కుకో గలరు అనడానికి ఇదే నిదర్శనం’ అని  కొనియాడుతున్నారు. 

రాజకీయాల్లో ఎప్పుడూ క్షణాల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలు, కఠినమైన ప్రకటనలతో కనిపించే యోగి ఆదిత్యనాథ్.. ఈ సాధారణ ఘటన ద్వారా అందరి హృదయాలను హత్తుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement