
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని సినిమా హాల్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం యువతీయువకులు వృత్తి జీవితంలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. తింటున్నా, ప్రయాణంలో ఉన్నా, చివరికి సినిమా థియేటర్లలో సినిమా ఎంజాయ్ చేస్తున్నా ఆఫీసు పని చేయక తప్పడం లేదు. బెంగళూరులోని స్థానిక థియేటర్‌లో ‘లోకా’ అనే కొత్త సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ థియేటర్‌లో ఓవైపు సినిమా చూస్తూ ఇంకోవైపు ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పని చేస్తూ ఒక యువతి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.