Viral Video: రద్దీ మార్కెట్‌లో యువతి ‘దిల్బర్‌’ స్టెప్పులు.. నీ కంటే అతనే బెటర్‌!

Woman Dance On Street In Viral Video, Auto Driver Joins Her - Sakshi

యువత సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాపులర్‌ పాటలకు, డైలాగ్‌లకు రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేయడం కామన్‌గా మారిపోయింది.  ఈ క్రమంలో ఫేమస్‌ అవ్వడం కోసం కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రవర్తించే తీరు ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. దానిని పట్టించుకోకుండా  రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, మార్కెట్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో రీల్స్‌, డ్యాన్స్‌లు చేస్తుంటారు. అచ్చం ఇలాగే  నడిరోడ్డుమీద ఓ యువతి డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సుస్మితా సేన్‌ దిల్బర్‌ పాటకు ఓ  యువతి రద్దీగా ఉన్న మార్కెట్ మధ్యలో డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్‌ జీన్స్‌, టాప్‌ ధరించి స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్‌ చేస్తుంటే మార్కెట్‌లో ఉన్న వాళ్లంతా తననే చూస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం యువతి మాత్రమే కారణం కాదు. ఆమె డ్యాన్స్‌ చేస్తుంటే వెనకాల ఓ ఆటో డ్రైవర్‌ తనను అనుకరించేందుకు ప్రయత్నించాడు. యువతి ఎలాంటి స్టెప్పులు వేస్తుందో చూస్తూ అచ్చం అలాగే చేసేందుకు ట్రై చేశాడు.

వీళ్లు ఇలా చేస్తుంటే మార్కెట్‌లోని ప్రజలు వారిని చుట్టుముట్టి ఆసక్తికరంగా చూశారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యువతితోపాటు ఆమె వెనకాల వ్యక్తి డ్యాన్స్‌ను చూసి పలువురు నవ్వుకుంటుంటే.. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో ఆ పిచ్చి గంతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. యువతి కంటే అతనే అందంగా డ్యాన్స్‌ చేశాడని కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top