రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్‌ ఆత్మహత్య | Woman Dies By Suicide In Karnataka After Alleged Blackmail Using Private Videos, More Details Inside | Sakshi
Sakshi News home page

రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్‌ ఆత్మహత్య

Jun 8 2026 12:37 PM | Updated on Jun 8 2026 1:05 PM

 Woman Blackmail Over Secret Videos

కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్‌లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్‌ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్‌లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది.

రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్‌ బౌన్స్‌ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్‌లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement