
కులం, మతం వదిలేస్తున్నా
జుబీన్ గార్గ్‌కు దహన సంస్కారాలు జరిపిన చోట ప్రతిన
జంధ్యం తెంచి పడేసి బ్రాహ్మణ యువకుడి ప్రకటన
గువాహటి: అసోంలోని గువాహటిలో గాయకుడు జుబీన్ గార్గ్‌కు దహన సంస్కారాలు జరిపి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు.. ‘ఇకపై కేవలం మనుషులా మాత్రమే జీవిస్తా. కులమతాల ప్రస్తావన వదిలేస్తా’అంటూ తన జంధ్యాన్ని తెంపి, చెత్తలో పడేశాడు. సన్ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు.. ఇకపై గార్గ్ నడిచిన బాటలోనే నడుస్తానని తెలిపాడు. కులమతాల అడ్డుగోడలను పగులగొట్టాలన్నాడు.
‘పుట్టుకతో నా కులం బ్రాహ్మణ. ఇప్పుడిక నాకు కులం, మతం అంటూ ఏదీ లేదు’అంటూ తన దుస్తుల్లోపలున్న జంధ్య తీసి, మీడియా చూస్తుండగానే తెంచి చెత్తలోకి వేశాడు. నా సోదరుడు జుబీన్ సాక్షిగా చెబుతున్నా. జంధ్యం మళ్లీ ధరించను. ఇటీవల సోషల్ మీడియాలో హిందూముస్లింలకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా వస్తున్నాయి. హిందువుల్లోనూ చాలా కులాలున్నాయి. శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు.
ఇలాంటి ఆచారాలు, విశ్వాసాలు ఎన్నో. అందుకే జబీన్ దా సాక్షిగా వాటన్నిటినీ వదిలేస్తున్నా. ఆరేళ్ల నా కుమారుడికి కూడా జంధ్య వేయను. మనుషుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. మానవత్వం అన్నిటికీ మించింది’అని పేర్కొన్నాడు. కాగా, బ్రాహ్మణ కుటుంబంలో జి»ొన్ బొర్తాకుర్ పేరుతో జని్మంచిన జుబీన్ గార్డ్ కూడా తనకు కులం–మతం లేదంటూ ప్రకటించుకున్నారు. జంధ్యాన్ని దోమ తెర కట్టేందుకు తాడు మాదిరిగా వాడుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు.