కరోనా: అమెరికా, బ్రెజిల్‌ కంటే భారత్‌లోనే ఎక్కువ!

WHO Data Reveals India 1 Day Covid Count More Than US Brazil Past 7 Days - Sakshi

గత వారం రోజులగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదవుతోంది. మంగళవారం నాటికి దేశంలో మొత్తంగా కరోనా కేసులు 22,68,675 చేరగా.. ఇప్పటి వరకు 45,257 మంది కోవిడ్‌ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా అత్యంత ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఇండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే ఒక రోజులో నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.(అమెరికా, బ్రెజిల్‌ కంటే వేగంగా!) 

వారం రోజులుగా రికార్డు స్థాయిలో
గత వారం రోజులుగా(ఆగష్టు 4-10) ఇండియాలో రికార్డు స్థాయిలో 4,11,379 మంది కరోనా బారిన పడగా.. 6,251 మంది మహమ్మారి కారణంగా మరణించారు. అదే సమయంలో అమెరికాలో 3,69,575 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,232 కరోనా మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్‌ విషయానికి వస్తే.. 3,04,535 మందికి వైరస్‌ సోకగా.. 6,914 మంది కోవిడ్‌తో మృతి చెందారు. అయితే గత నాలుగు రోజులుగా దేశంలో వరుసగా 60 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు 70 శాతంగా ఉండటం భారత్‌కు సానుకూలాంశమని చెప్పవచ్చు.(10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ).  

మరణాల రేటు తక్కువే.. అయితే
ఈ రెండు దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగానే ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 16 లక్షలకు చేరువైనట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. మరణాల రేటు 1.99 శాతానికి పడిపోయిందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే కరోనా టెస్టుల విషయంలో మాత్రం భారత్‌ వెనుకబడే ఉందని వరల్డోమీటర్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. యూఎస్‌లో 1 మిలియన్‌ జనాభాకు 1,99,803 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బ్రెజిల్‌లో ఈ సంఖ్య 62,200గా ఉంది. భారత్‌లో మాత్రం ప్రతీ పది లక్షల మంది జనాభాకు కేవలం 18, 300 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆగష్టు 10న భారత్‌లో 62, 064 కేసులు నమోదు కాగా అమెరికాలో 53, 893 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే రోజున బ్రెజిల్‌లో 49, 970కి కరోనా సోకింది. 

ఆగష్టు 4న పాజిటివ్‌ కేసుల సంఖ్య

 • భారత్‌- 52,050
 • అమెరికా- 47,183
 • బ్రెజిల్‌- 25,800

ఆగష్టు 5

 • భారత్‌- 52,509
 • అమెరికా- 49,151
 • బ్రెజిల్‌-16,641

ఆగష్టు 6

 • భారత్‌- 56,282
 • అమెరికా- 49,629 
 • బ్రెజిల్‌-51,603

ఆగష్టు 7

 • భారత్‌ 62,538
 • అమెరికా- 53,373
 • బ్రెజిల్‌-57,152

ఆగష్టు 8

 • భారత్‌- 61,537  
 • అమెరికా- 55,318
 • బ్రెజిల్‌- 53,139

ఆగష్టు9

 • భారత్‌- 64,399
 • అమెరికా-61,028
 • బ్రెజిల్‌- 50,230

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-09-2020
Sep 23, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,347  కరోనా పాజిటివ్ కేసులు...
23-09-2020
Sep 23, 2020, 09:21 IST
బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌...
23-09-2020
Sep 23, 2020, 08:59 IST
హైదరాబాద్ : కోవిడ్‌–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ,...
23-09-2020
Sep 23, 2020, 05:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేళ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్‌ నిర్ధారణకు వచ్చినట్లు...
23-09-2020
Sep 23, 2020, 03:58 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24...
23-09-2020
Sep 23, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని...
23-09-2020
Sep 23, 2020, 03:33 IST
మాస్కో: కరోనా వైరస్‌ ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా స్పుత్నిక్‌ వీ తర్వాత మరో వ్యాక్సిన్‌ను...
22-09-2020
Sep 22, 2020, 21:26 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశంపై...
22-09-2020
Sep 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465.
22-09-2020
Sep 22, 2020, 19:26 IST
జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది?
22-09-2020
Sep 22, 2020, 17:56 IST
అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
22-09-2020
Sep 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్‌...
22-09-2020
Sep 22, 2020, 15:53 IST
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో సైతం రోజురోజుకు అత్యంతగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 వేల మందికి...
22-09-2020
Sep 22, 2020, 14:13 IST
ముంబై: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్‌ నటి, ప్రముఖ థియేటర్‌ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్‌(79) బలైపోయారు....
22-09-2020
Sep 22, 2020, 14:07 IST
బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు...
22-09-2020
Sep 22, 2020, 10:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24...
22-09-2020
Sep 22, 2020, 09:05 IST
అమలాపురం టౌన్‌ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేసిన...
22-09-2020
Sep 22, 2020, 04:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది...
22-09-2020
Sep 22, 2020, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన...
21-09-2020
Sep 21, 2020, 20:07 IST
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో జిల్లాలో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్ల‌ను క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ ప్ర‌క‌టించారు. ఎ.కొండూరు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top