వైరల్‌: చెట్టెక్కి కూర్చున్న దొంగ.. పోలీసులు ఏం చేశారంటే?

Viral Video: Thief Refuses to Come Down From Tree Do You Now What happen Next - Sakshi

రాయ్‌పూర్‌: చిన్నప్పుడు అందరూ దొంగ-పోలీస్‌ ఆట ఆడే ఉంటారు. దొంగలు దాక్కుంటే పోలీసు వారిని వెతికి పట్టుకోవడమే ఈ ఆట. సరిగ్గా చిన్నప్పుడు ఆడే ఈ ఆటలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులకు చిక్కుకుండా ఓ దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చెట్టెక్కి మీద కూర్చున్నాడు. చెట్టు వద్దకు చేరుకున్న పోలీసులు దొంగను కిందకు దిగి రావాలని కోరారు. వాళ్లు ఎంత చెప్పిన సదరు దొంగ ససేమిరా రానన్నాడు. దీంతో విసుగు చెందిన పోలీసులు ఓ ప్లాన్‌ వేశారు.

ఓ పోలీస్‌ ఆఫీసర్‌ బూట్లు విప్పీసి చెట్టెక్కేశారు. తప్పించుకునే దారిలేదని తెలిసి కూడా ఆ దొంగ.. చెట్టుమీదనే మరింత పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, వేరే మార్గం లేక ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ వీడియోను చత్తీస్‌ఘడ్‌ ఐపీఎస్‌ పోలీస్‌ అధికారి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. దొంగోడి అతి తెలివికి నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.. ‘చెట్టెక్కి తప్పించుకోవటం ఏంట్రా బాబు.. దొరకి పోయావ్‌గా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: వైరల్‌: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top