వావ్‌ ఏంటి అద్భుతం... పులులు వాకింగ్‌ చేస్తున్నాయా!

Viral Video Six Tigers Were Spotted Walking Together In Maharashtra - Sakshi

మహారాష్ట్ర: నిజానికి ఏనుగులు, గేదేలు, తదితర జంతువులే గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాలు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడోక అరణ్యంలో మనుషుల మాదిరిగా వాకింగ్‌ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు ఎలా చక్కగా కలిసి నడుస్తున్నాయో చూడండి. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!)

అసలు విషయంలోకెళ్లితే... ఆరు పులులు కలిసి అటవీ మార్గంలో నడుస్తున్నాయి. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు వస్తుంటుంది. అంతేకాదు ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి అడవిలోకి పరుగెత్తుతుంది. ఈ మేరకు మహారాష్ట్రలోని ఉమ్రేద్ కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో 6 పులులు కలిసి నడుస్తున్నట్లు ఉన్న అరుదైన వీడియోని బాలీవుడ్‌ నటుడు రణదీప్ హుడా "చప్పర్ ఫాడ్ కే" అనే క్యాప్షన్‌ని జోడించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఈ మేరకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి రమేష్ పాండే మాట్లాడుతూ "ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. ఇటీవల కాలంలో మేము పన్నా పెంచ్, దుధ్వాలో 5 పులుల సమూహాలను చూశాము కానీ ఇప్పుడు 6 పులులు కలిసి నడుస్తున్నాయి. అయితే ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది" అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: వ్యవసాయ చట్టాల రద్దుపై యూఎస్‌ కాంగ్రెస్‌ స్పందన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top