వ్యవసాయ చట్టాల రద్దుపై యూఎస్ కాంగ్రెస్ స్పందన

న్యూయార్క్: భారతదేశంలోని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ లెవిన్ స్వాగతించారు. గతేడాది కాలంగా రైతుల నిరసనలకు కేంద్రంగా నిలిచిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఆ హోటల్‌లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..)
ఈ నేపథ్యంలో ఒక సంవత్సరానికి పైగా నిరసనల తర్వాత భారత్‌లో ఇలా మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఆండీ లెవిన్ అన్నారు. అంతేకాదు కార్మికులు కలిసికట్టుగా ఉంటే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించగలరని చెప్పడానికి ఇదోక నిదర్శనం అని పైగా వారు యావత్ భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురోగతిని సాధించగలరు అంటూ ఆండీ లెవిన్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.