వైరల్‌: హర్యానా రాణితో ముసలాయన స్టెప్పులు.. తగ్గేదేలే! | Viral Video: Sapna Choudhary Dances On Stage As Old Man Dances | Sakshi
Sakshi News home page

వైరల్‌: హర్యానా రాణితో ముసలాయన స్టెప్పులు.. తగ్గేదేలే!

Jan 9 2022 5:29 PM | Updated on Jan 9 2022 5:55 PM

Viral Video: Sapna Choudhary Dances On Stage As Old Man Dances - Sakshi

డ్యాన్స్‌ అంటే ఎక్కడా లేని హుషారు వస్తుంది. తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎంత డ్యాన్స్‌ రాని వారైనా కాళ్లు చేతులు కదుపుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు.  అయితే డ్యాన్స్‌ను ఫ్యాషన్‌గా భావించి., తమలోని టాలెంట్‌ను నిరూపించేందుకు నిరంతరం తాపత్రయ పడేవారు కొందరైతే మరికొందరు అందరి మధ్య డ్యాన్స్‌ చేసేందుకు సిగ్గు పడుతుంటారు.  తాజాగా ఓ వృద్ధుడు తన వయసును మర్చిపోయి వేలాది మంది ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు.

సప్నా చౌదరి... హర్యానా రాణిగా ఆమె పాపులర్. ఎప్పుడూ డ్యాన్స్‌ వీడియోలతో అలరించే సప్నాకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సప్నా చౌదరికి చెందిన ఓ పాత వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో వేలాది మంది ముందు స్టేజ్‌పై సప్నా హర్యాన్వి పాటకు డ్యాన్స్‌ చేస్తోంది. చుట్టు ఉన్న జనాలు చప్పట్లతో ఆమెను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇంతలో స్టేజ్‌ ముందు కూర్చున్న ఓ ముసలాయన లేచి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు.
చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!

ఏ మాత్రం మోహమాటపడకుండా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. సప్నాకు ఎదురుగా నిలబడి దూరం నుంచి హుషారైన స్టెప్పులతో ఏజ్‌ ఇజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అని నిరూపించాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు మూడు మిలియన్ల వ్యూమ్స్‌ సంపాదించింది. 
చదవండి: నెటిజన్‌ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా

Advertisement
 
Advertisement
Advertisement