నమ్మలేకపోతున్నాం.. అదెలా సాధ్యం..

Viral Video: Parked Bike Moves On Its Own Recorded In CCTV - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఇంటిముందు పార్క్‌ చేసి ఉన్న ఓ ద్విచక్రవాహనం అర్థరాత్రి దానికి అదే కదిలిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియోను అంబర్‌ జైదీ అనే ట్వీటర్‌ యూజర్‌ ఖాతాలోని ఈ పోస్ట్‌ వైరల్‌గా వారింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా సాధ్యమంటూ అక్కడ ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. ‘కెమెరాలో రికార్డు అయ్యింది.. లేదంటే ఎవరూ నమ్మేవారు కాదు’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. (చదవండి: డ్రైవర్‌ లేకుండా ముందుకెళ్లిన బస్‌.. వీడియో వైరల్‌)

30 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో  నిశ్శబ్ధంగా ఉన్న వీధిలో అర్థరాత్రి ఓ ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న వాహనం  ఉన్నట్టుండి దానికి అదే ముందుకు కదిలింది. అలా కదులుతూ టర్న్‌ చేసుకుంటుండగా ఆ వాహనం కింద పడిపోయింది. అయితే దానిపై ఎవరూ లేకపోవడంలో నెటిజన్‌లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘నమ్మలేక పోతున్న.. దెయ్యాలు నిజంగా ఉంటాయి’, ‘ఆత్మలు ఉంటాయడానికి ఇదే ఉదహరణ’, ‘ఎవరిదో ఆత్మ ఈ బండిలో దూరింది’ అంటూ నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు.

 (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top