Viral Video: Kerala Doctors Dance Performance Malayalam Song Pala Palli Thirupalli - Sakshi
Sakshi News home page

Viral Video: కిల్లింగ్‌ స్టెప్స్‌తో అదరగొట్టిన డాక్టర్లు

Aug 16 2022 6:28 PM | Updated on Aug 16 2022 8:50 PM

Viral Video: Kerala Doctors Dance Performance Malayalam Song Pala Palli Thirupalli - Sakshi

వీరిద్దరూ డాన్స్‌ చేసిన వీడియోను కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్వయంగా తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

డాక్టర్లంటే నిరంతరం పేషంట్లను పరీక్షిస్తూ బిజీబిజీగా గడుపుతూ సీరియస్‌ ఉంటారు. కానీ కొంత మంది కళాపోషకులు ఉంటారు. వృత్తితో పాటు తమకిష్టమైన వ్యాపకాల్లో మెరుస్తుంటారు. కేరళలోని వయనాడ్‌ గిరిజన ఆస్పత్రి వైద్యులు సవాన్ సారా మాథ్యూ, సఫీజ్ అలీ రూటే సపరేటు. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి డాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరూ డాన్స్‌ చేసిన వీడియోను కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్వయంగా తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

నల్లూరునాడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సవాన్ సారా మాథ్యూ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సఫీజ్ అలీ ఉత్సాహంగా డాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం ‘కడువా’లోని పాల పల్లి తిరుపల్లికి పాటకు వీరిద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియోను వీణా జార్జ్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. 

డాక్టర్ల డాన్స్‌ వీడియోకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు వైద్యులిద్దరినీ నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తారు. పెద్ద మనసుతో తమ వీడియోను షేర్‌ చేసిన మంత్రి వీణా జార్జ్‌కు డాక్టర్లు ఇద్దరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: అక్కడ లాక్‌డౌన్‌ అంటే చాలు జనాలు జంప్‌!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement