 
													Karnataka School Students Attack on Teacher Video Viral: ‘ఆచార్య దేవో భవ’..అని సాధారణంగా అంటుంటారు. అంటే తల్లిదండ్రుల తరువాత గురువులు దేవుడితో సామానం అని అర్థం. గురువు తనకున్న జ్జానాన్ని పిల్లలకు బోధించి వారికి బంగారు భవిష్యత్తును అందిస్తాడు. భారతదేశంలో గురువుకి ఎంతో గొప్ప స్థానం ఉంది. కానీ చదువు చెప్పే గురువుపై కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో డిసెంబర్ 3న చోటుచేసుకుంది.
దావణగెరే జిల్లా, చన్నగిరి టౌన్‌లోని నల్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోకి రాగానే ఉపాధ్యాయుడికి గుట్కా ప్యాకెట్‌లు కనిపించాయి. క్లాస్ రూమ్‌లో క్ష్రమశిక్షణ పాటించాలని చెప్పినందుకు విద్యార్థులు తమ టీచర్‌ను దారుణంగా వేధించారు. టీచర్ వద్దకు వెళ్లి చెత్త బుట్టను ఆయన తలపై పెట్టి నానా హంగామా చేశారు. ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
చదవండి: 12 వేల బాతులను చంపేశారు!
ఈ నేపథ్యంలో కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నాగేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. పాఠశాల విద్యార్థులు తమ టీచర్‌పై దాడి చేయడం సహించరానిదన్నారు. ఈ సంఘటనపై విద్యా శాఖ, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. తాము ఎల్లప్పుడూ టీచర్లకు మద్దతుగా ఉంటామమని, అమానవీయంగా ప్రవర్తించిన పిల్లలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బాధిత టీచర్ పేర్కొన్నారు.
చదవండి: రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ
🙌 https://t.co/5hf23oOwwN pic.twitter.com/rmrjuuZep4
— Samarth ⚡ (@SamarthAppu) December 11, 2021

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
