సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి ఎన్నిక | Veteran Kerala leader Mariam Alexander Baby elected CPI-M party GS | Sakshi
Sakshi News home page

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి ఎన్నిక

Apr 7 2025 5:01 AM | Updated on Apr 7 2025 5:01 AM

Veteran Kerala leader Mariam Alexander Baby elected CPI-M party GS

మదురై: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్‌ నేత మరియమ్‌ అలెగ్జాండర్‌(ఎంఏ) బేబి ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో ఆదివారం జరిగిన సీపీఎం 24వ ఆల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ ఎన్నిక జరిగింది. కొందరు నేతలు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) అధ్యక్షుడు అశోక్‌ ధవాలేను ఈ పదవికి బలపరిచారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో బేబి ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన 18 మందితో కూడిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్‌ బ్యూరో ఎంఏ బేబిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. 

అదేవిధంగా, 85 మందితో కూడిన సెంట్రల్‌ కమిటీలోకి 20 శాతం మంది మహిళలను తీసుకున్నట్లు ఆ పార్టీ ‘ఎక్స్‌’లో తెలిపింది. 2023 సెప్టెంబర్‌లో అనారోగ్య కారణాలతో సీతారాం ఏచూరి కన్నుమూయడంతో ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ప్రకాశ్‌ కారత్‌ తాత్కాలిక సమన్వయకర్తగా ఆ బాధ్య తలను నిర్వర్తిస్తున్నారు. కాగా, పొలిట్‌ బ్యూరో నుంచి సీనియర్‌ నేతలు ప్రకాశ్‌ కారత్, బృందా కారత్‌ వైదొలిగారు. వీరిద్దరితోపాటు మణిక్‌ సర్కార్‌ను పార్టీ కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వాని తులుగా ప్రకటించినట్లు సమాచారం.

విద్యార్థి దశ నుంచే..
కేరళలోని ప్రక్కులంలో 1954లో జన్మించిన ఎంఏ బేబి విద్యార్థి దశలోనే సీపీఎం పట్ల ఆ కర్షితుడయ్యారు. కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సభ్యుడయ్యారు. కొల్లమ్‌లోని ఎస్‌ఎన్‌ కాలేజీలో బీఏలో చేరినా చదువు కొనసాగించలేకపో యారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల్లో పలు పదవులు చేపట్టారు. 1986–98 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా, 2006–16 మధ్య ఎమ్మెల్యేగా కొనసా గారు. కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement