ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వెడ్డింగ్‌కార్డుపై సోషల్ మీడియాలో దుమారం.. చివరకు

Uttarakhand Bjp Leader Cancels Daughter Wedding To Muslim Man - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు యశ్‌పాల్‌ బినాం.. తన కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. మే 28న ముహూర్తం ఖరారు చేశారు. వెడ్డింగ్‌కార్డులు కూడా ప్రింట్ చేయించేసి బంధు మిత్రులకు పంపారు. ఘనంగా వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లి ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. బంధమిత్రులు, నెటినజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వివాదం కూడా తలెత్తింది. కొందరు నిరసనలు కూడా చేపట్టారు. దీంతో తన కూతురు పెళ్లి పోలీసులు, పటిష్ఠ బందోబస్తు నడుమ చేయాలనుకోవడం లేదని యశ్‌పాల్ తెలిపారు. అందుకే మే 28న జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరు కుటుంబాలు చర్చించుకుని పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకున్నామని, అబ్బాయి కుటుంబంతో చర్చించిన తర్వాత తన కూతురు పెళ్లి విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పకొచ్చారు. ఇద్దరూ ఇష్టపడటంతో వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉంటుందనే పెళ్లికి అంగీకరించామని, కానీ సోషల్‌ మీడియాలో వెడ్డింగ్ కార్డు వివాదాస్పదం కావడం బాధించిందని యశ్‌పాల్ తెలిపారు.

చదవండి: నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top