రైతు చట్టాల వివాదం: కేంద్రానికి బైడెన్‌ మద్దతు

US On Farm Laws Amid Protest Will Improve Efficiency Of India Markets - Sakshi

కేంద్రాన్ని సమర్థించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా రిహన్నా, గ్రెటా థన్‌బర్గ్‌, కమలా హారిస్‌ మేన కోడలు మీనా హారిస్‌ వంటి ఇంటర్నెషనల్‌ సెలబ్రిటీలు రైతులకు మద్దతు తెలపడం పట్ల క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మా దేశ అంతర్గత విషయాల్లో మీ జోక్యం అనవసరం అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కేంద్రానికి మద్దుతుగా నిలిచింది. భారతదేశం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు దేశ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. 
(చదవండి: బిల్‌ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!)

ఈ సందర్భంగా ఆయన ‘‘ఈ చట్టాలకు మేం మద్దతిస్తున్నాం. ఇక  శాంతియుత నిరసనలు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య ముఖ్య లక్షణంగా అమెరికా గుర్తిస్తోంది. భారతదేశ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచడమే కాక ఎక్కువ ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించే ఈ చర్యలను స్వాగతిస్తున్నాం’’ అని తెలిపారు. ఇక రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ఇవ్వడంపై అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బ తీయలేదన్నారు. అభివృద్ధే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు. (అంతర్జాతీయ మద్దతు: అమిత్‌ షా ఆగ్రహం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top