భవిష్యత్‌ అంతా సాంకేతికతదే | Upgrade skills continuously to navigate tech-driven future says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ అంతా సాంకేతికతదే

Oct 10 2026 6:38 AM | Updated on Oct 10 2026 6:38 AM

Upgrade skills continuously to navigate tech-driven future says PM Narendra Modi

నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి 

సాంకేతికతను అందిపుచ్చుకోండి 

యువతకు ప్రధాని మోదీ పిలుపు 

న్యూఢిల్లీ: భవిష్యత్‌ అంతా సాంకేతికతదేనని, యువత నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. నెపుణ్యం కలిగిన మానవ వనరులకు దేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణా సంస్థలు సమన్వయంతో ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలోని షాంఘై వేదికగా జరిగిన 48వ వరల్డ్‌స్కిల్స్‌ పోటీల్లో దేశం తరఫున పాల్గొన్న బృందంతో ఆయన ప్రత్యేకంగా సంభాషించారు.

 న్యూఢిల్లీలోని 7–లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, దేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థలను మెరుగుపరచడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు లక్ష్యం ఇదేనన్నారు. పోటీలో తమ అనుభవాలను యువత ప్రధానితో పంచుకున్నారు. డిగ్రీలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యం కూడా ముఖ్యమైనదన్నారు. 48వ వరల్డ్‌స్కిల్స్‌ పోటీ చైనాలోని షాంఘైలో సెపె్టంబర్‌ 22 నుంచి 27 వరకు జరిగింది. భారత్‌ నుంచి 70 మంది యువత పాల్గొన్నారు. ఆరు రజత పతకాలు, 20 ఉత్తమ ప్రతిభ పతకాలను గెలుచుకుని 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement