ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్‌

Unparliamentary words row: No word is banned Says LS Speaker - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. 

కొన్ని పదాలను తొలగించామని, తొలగించబడిన పదాల సంకలనం మాత్రమే జారీ చేయబడిందని, అంతేగానీ ఎలాంటి పదాలను నిషేధించలేదని పేర్కొన్నారు ఆయన. గురువారం సాయంత్రం ఆయన ఈ విషయంపై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు.

లోక్‌సభ సెక్రటేరియెట్‌ బుక్‌లెట్‌లో అన్‌పార్లమెంటరీ పదాలపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ‘‘ఏ పదం నిషేధించబడలేదు, 1954 నుండి కొనసాగుతున్న పద్దతి ప్రకారమే.. పార్లమెంటు కార్యకలాపాల సమయంలో తొలగించాం అని స్పష్టత ఇచ్చారు స్పీకర్‌. ఇంతకుముందు ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాల పుస్తకం విడుదలైంది... పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో పెట్టాం. పదాలు నిషేధించబడలేదు, తొలగించబడిన పదాల సంకలనాన్ని మేము జారీ చేశాం. వారు (ప్రతిపక్షాలు) ఈ 1,100 పేజీల నిఘంటువు (అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన) చదివారా? చదివి ఉంటే... అపోహలు వ్యాపించవు... ఇది 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో విడుదలైంది. 2010 నుంచి వార్షిక ప్రాతిపదికన విడుదల చేయడం ప్రారంభించింది. దయచేసి.. నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ ఆయన విపక్షాలను కోరారు.

లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా రిలీజ్‌ చేసిన పదాల జాబితాలో జుమ్లాజీవి, బాల్‌ బుద్ధి, కోవిడ్‌ స్పెడర్‌, స్నూప్‌గేట్‌, అషేమ్డ్‌, ఎబ్యూజ్డ్‌, బెట్రేయ్డ్‌, కరప్ట్‌, డ్రామా, హిపోక్రసీ, ఇన్‌కాంపీటెంట్‌.. తదితర పదాలను అన్‌పార్లమెంటరీ జాబితాలో చేర్చారు. లోక్‌సభ, రాజ్యసభకు రెండింటిలో ఇది వర్తించనుంది. అయితే ఈ లిస్ట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తో పాటు విపక్షాలు.. నిషేధం విధించారంటూ విమర్శలు గుప్పిస్తోంది కేంద్రంపైన. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top