Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు

Union Budget 2022: Visakhapatnam Steel Plant - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్‌లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్‌ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్‌ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్‌ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.33.18 కోట్లు.

చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top