Uddhav camp challenges EC: ఈసీ ఆదేశాలపై సుప్రీం కోర్టుకు ఉద్ధవ్‌ థాక్రే వర్గం

Uddhav Faction Challenges EC In SC On Decide Real Shiv Sena - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో పొత్తుతో సీఎం పదవిని అధిరోహించారు. ఆ తర్వాత కొందరు ఎంపీలు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో శివసేన తమదే నంటూ ఇటు షిండే వర్గాలు పేర్కొనగా.. థాక్రే వర్గాలు తమదేనని బలంగా వాదిస్తున్నాయి. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరింది ఉద్ధవ్‌ థాక్రే వర్గం. 

ఎమ్మెల్యేల అనర‍్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది థాక్రే వర్గం. ‘ఈనెల 22న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీని అనుమతించినట్లయితే.. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల సమస్యలను ఆక్షేపించటమే కాకా.. ఈసీ చర్యల వల్ల కోలుకోలేని దెబ్బపడుతుంది. శాసనసభ్యులుగా అనర్హులైన వారి పిటిషన్లు చెల్లవు. ప్రస్తుత సమయంలో ఈసీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. ’ అని పేర్కొంది. 

షిండే వర్గం అక్రమంగా తమకు ఎక్కువ మద్దతు ఉందని చెబుతోందని, కృత్రిమ మెజారిటీని సృష్టిస్తోందని ఆరోపించింది ఉద్ధవ్‌ థాక్రే వర్గం. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొంది. శివసేన ఎవరిదనే అంశంలో ముందుకు వెళ్లకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది థాక్రే వర్గం.

ఇదీ చదవండి:  ఇది కదా అసలు ట్విస్ట్‌.. మహారాష్ట్ర సీఎం షిండే, ఉద్ధవ్‌ థాక్రేకు బిగ్‌ షాక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top