బారాముల్లా ఎన్‌కౌంటర్‌ : లష్కరే కీలక కమాండర్‌ హతం | Two Terrorists Including LeT Top Commander Sajjad Killed | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Aug 17 2020 7:59 PM | Updated on Aug 17 2020 7:59 PM

Two Terrorists Including LeT Top Commander Sajjad Killed - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ లష్కరే తోయిబా కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కూడిన సంయుక్త బృందం లష్కరే కమాండర్‌ సాజద్‌ అలియాస్‌ హైదర్‌ సహా మరో లష్కరే ఉగ్రవాదిని హతమార్చింది. అంతకుముందు ఉగ్రవాదుల దాడిలో పోలీస్‌ అధికారితో పాటు ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్  తెలిపారు.

దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది సాజిద్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తర కశ్మీర్‌లో చురకుకుగా పనిచేసే ఉగ్రవాది సాజిద్‌ను హతమార్చామని, ఇక్కడ టాప్‌ 10 ఉగ్రవాదుల్లో సాజిద్‌ ఒకడని జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. అనతుల్లా మిర్‌ అనే మరో ఉగ‍్రవాదిని మట్టుబెట్టామని చెప్పారు. బారాముల్లాలో తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరకు జవాన్లకూ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. చదవండి : బారాముల్లా ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు జ‌వాన్లు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement