మా స్కూల్‌ సమీపంలో మద్యం షాపును తీసేయండి!

Two Students Ask Official To Move Liquor Shop And Takes Action - Sakshi

చెన్నై: తమిళనాడులోని అరియలూరు జిల్లాలో తమ పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేసేయండి అంటూ ఇద్దరూ పాఠశాల విద్యార్థులైన అక్కాతమ్ముడు జిల్లా కలెక్టరుకు లేఖ పంపారు. పైగా ఈ విద్యార్థులిద్దరూ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి కూడా చేశారు. అయితే తొబుట్టువులైన ఈ విద్యార్థులు ఇరువురు ఇలంతేంద్రల్  ఆరవ తరగతి, అరివరసన్ నాల్గవ తరగతి చదువుతున్నారు.

(చదవండి:అమేజింగ్‌ ఆర్ట్‌ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!)

ఈ క్రమంలో ఈ విద్యార్థులిద్దరూ నవంబర్‌లో స్కూళ్లు తెరవక మునుపే మా స్కూల​ సమీపంలోని  మద్యం దుకాణాన్ని తీసువేయండి అంటూ లేఖలో అభ్యర్థించారు. ఈ మేరకు ఆ విద్యార్థులిద్దరూ మాట్లాడుతూ.....మద్యం సేవించే వాళ్లు ఆ షాపు దగ్గర కూర్చొని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటూరు.

అంతేకాదు చాలామంది తల్లిదండ్రులు ఈ మద్యానికి బానిసై పిల్లలను పనికి పంపి వారిని అడుక్కునేలా చేస్తారు. అన్ని మద్యం షాపులు మూసివేస్తేనే ఈ సమస్య ఉండదు" అని అన్నారు. ఈ క్రమంలో ఆ మద్యం షాపు నిబంధనలకు అనుగుణంగా 100 కి.మీ దూరంలో ఉన్నప్పటికీ పిల్లల విజ్ఞప్తి మేరకు ఆ షాపుని తరలించాలని నిర్ణయించామని  అరియలూర్ కలెక్టర్ పి రమణ సరస్వతి తెలిపారు.

(చదవండి: మేమే నీతో పాటే అంటూ ....చనిపోయిన భర్త, పిల్లలు)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top