దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి! | Truck Rammed Into Shops Four Killed | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి!

Dec 17 2023 8:35 AM | Updated on Dec 17 2023 9:48 AM

Truck Rammed Into Shops Four Killed - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ నుంచి ఆగ్రా వైపు వేగంగా వెళ్తున్న ట్రాలీ అదుపు తప్పి జాతీయ రహదారిపై మాణిక్‌పూర్ మలుపు సమీపంలోని రెండు షాపుల్లోకి దూసుకెళ్లింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇదే ట్రాలీ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే డీఎం, ఎస్‌ఎస్‌పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 10:20 గంటల ప్రాంతంలో కాన్పూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న ట్రాలీ మాణిక్‌పూర్ మలుపు సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న పలువురు ట్రాలీ కింద చిక్కుకుపోయారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఇక్డిల్ పోలీస్ స్టేషన్  సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌, జేసీబీలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: దేశంలో తొలి ఏఐ సిటీగా లక్నో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement