కరోనా బారిన మరో ముఖ్యమంత్రి | Tripura CM Biplab Kumar Deb Tested Positive | Sakshi
Sakshi News home page

కరోనా బారిన మరో ముఖ్యమంత్రి

Apr 7 2021 7:15 PM | Updated on Apr 7 2021 7:16 PM

Tripura CM Biplab Kumar Deb Tested Positive - Sakshi

అగర్తాల: కరోనా వైరస్‌ బారిన మరో ముఖ్యమంత్రి పడ్డారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు తాజాగా కరోనా వైరస్‌ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్‌ తేలిందని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. ఒక్కరోజే లక్ష 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు.

చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్‌

Advertisement
 
Advertisement
Advertisement