సాక్షి, మంచిర్యాల: శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి చెందారు మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



