Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

Top10 Telugu Latest News Morning Headlines 9th June 2022 - Sakshi

1..రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌ దళాల వెనుకంజ!
ర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరం సెవెరోడొనెట్స్‌క్‌పై రష్యా సేనలు బుధవారం పట్టుబిగించాయి. దాంతో ఉక్రెయిన్‌ దళాలు వెనక్కి మళ్లుతున్నాయి. తాత్కాలికంగా వెనక్కి తగ్గినా రష్యాపై యుద్ధం ఆపబోమని లుహాన్‌స్క్‌ గవర్నర్‌ చెప్పారు. సైన్యం ఎదురు దాడికి అనువైన ప్రాంతాల్లోకి చేరుకుందని చెప్పారు. డోన్బాస్‌లోని లుహాన్స్‌క్‌తో పాటు డొనెట్స్‌క్‌పైనా పట్టు బిగించామని రష్యా ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2..రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ
అభివృద్ధి చెందిన నగరాలు, రాజధానులు అన్నిరకాలుగా అభివృద్ధి సాధించి ఆ స్థాయికి రావడానికి కనీసం 40–50 సంవత్సరాలు పట్టిందని, రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వ సతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3..పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు
వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌కుమార్‌రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4..‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్‌.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్‌ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5..హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో
బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నేతలను జాతీయ పార్టీ దూతలు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, పటిష్టానికి ఈ భేటీని వినియోగించుకునే దిశగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6..ఎలాన్‌మస్క్‌కి ట్విటర్‌ కౌంటర్‌ ఎటాక్‌ ?
మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..Mithali Raj Retirement: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్‌ అంటేనే పురుషుల క్రికెట్‌... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్‌ వచ్చాకే తెలిసింది.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8..VJ Sunny: బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు
బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్‌ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ హీరోగా ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9..సైబర్‌ టాక్‌: కొనకుండానే లాటరీ వచ్చిందా?!
లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్‌ కాల్‌ లేదా ఇ–మెయిల్‌ లేదా ఎసెమ్మెస్, వాట్సప్‌ ల ద్వారా లింక్స్, స్క్రాచ్‌కార్డ్‌లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్‌లైన్‌లో లాటరీ స్కామ్‌ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10..అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్న పోర్న్‌ వెబ్‌సైట్లు 
జూబ్లీహిల్స్‌... మొఘల్‌పుర... కాలాపత్తర్‌... రామ్‌గోపాల్‌పేట్‌... కార్ఖానా... ఇలా నగరంలో వరుసగా దారుణాలు వెలుగులు చూస్తున్నాయి. ప్రతి ఉదంతంలోనూ నలిగిపోయింది మాత్రం బాలికలే. జూబ్లీహిల్స్, కార్ఖానా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మైనర్లు ఉన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top