రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌ దళాల వెనుకంజ!

Russia Has Taken Control Of Residential Areas Of Severodonetsk - Sakshi

సీవిరోడోంటెస్క్‌లో రష్యాపై యుద్ధానికి విరామం

లుహాన్‌స్క్, డోంటెస్క్‌పై పట్టు బిగించాం: రష్యా 

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరం సెవెరోడొనెట్స్‌క్‌పై రష్యా సేనలు బుధవారం పట్టుబిగించాయి. దాంతో ఉక్రెయిన్‌ దళాలు వెనక్కి మళ్లుతున్నాయి. తాత్కాలికంగా వెనక్కి తగ్గినా రష్యాపై యుద్ధం ఆపబోమని లుహాన్‌స్క్‌ గవర్నర్‌ చెప్పారు. సైన్యం ఎదురు దాడికి అనువైన ప్రాంతాల్లోకి చేరుకుందని చెప్పారు. డోన్బాస్‌లోని లుహాన్స్‌క్‌తో పాటు డొనెట్స్‌క్‌పైనా పట్టు బిగించామని రష్యా ప్రకటించింది.

ఖర్కీవ్‌పైనా భారీ దాడులు
ఉత్తర ఉక్రెయిన్‌పైనా రష్యా వైమానిక దాడులను ఉధృతం చేసింది. వాటిలో ఐదుగురు మరణించారు. ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌ సైనిక వాహనాల మరమ్మతు కేంద్రాన్ని క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది.

యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: జెలెన్‌స్కీ 
డోన్బాస్‌లో రష్యాపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. తమ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. ప్రపంచ శాంతి కోసం రష్యాను ఓడించాలని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శాంతి చర్చలకు ఇప్పటికీ సిద్ధమన్నారు.

ఆహార ధాన్యాలు విడుదల చేయండి: ఇటలీ 
ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నందున ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాలను విడుదల చేయాలని రష్యాను ఇటలీ డిమాండ్‌ చేసింది. ఆకలి చావులు సంభవించకుండా చర్యలు తీసుకోవాల్సిన  బాధ్యత రష్యాపై ఉందన్నారు. యుద్ధంతో 22 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉక్రెయిన్‌లో నిలిచిపోయినట్లు అచనా.
చదవండి: సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్‌

ఆహార ధాన్యాల ఎగుమతికి రష్యా అంగీకారం 
ఉక్రెయిన్‌ నుంచి నల్ల సముద్రం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతికి రష్యా అంగీకరించింది. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్‌ కవుసోగ్లూతో భేటీ సందర్భంగా ఈ అభ్యర్థనకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, సానుకూలంగా స్పందించారు. నల్ల సముద్రంలో ఉక్రెయిన అమర్చిన మందుపాతరలను తొలగిస్తేనే ఎగుమతి సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top