Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట! | Top10 Telugu Latest News Morning Headlines 10th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

Jun 10 2022 10:00 AM | Updated on Jun 10 2022 10:21 AM

Top10 Telugu Latest News Morning Headlines 10th June 2022 - Sakshi

తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది.

1.. Russia-Ukraine war: వీధుల్లో హోరాహోరీ
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్‌
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


3.. Hyderabad: స్టూడెంట్స్‌పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్‌ పాస్‌ చార్జీలు 

 ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం
తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే  జరుపుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. IRCTC Tour Packages: ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ చంద్రమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. Ante Sundaraniki Review: ‘అంటే..సుందరానికీ’ ట్విటర్‌ రివ్యూ
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లెటెస్ట్‌ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..Ind Vs SA 1st T20: మిల్లర్, డసెన్‌ విధ్వంసం.. భారత్‌ ఓటమి
టి20ల్లో భారత్‌ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్‌ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. పేటీఎం సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌.. వివరాలు ఇదిగో...
డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 19 వరకు ఉంటుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. ‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్‌గా లేను’
మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్‌గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్‌ యాప్స్‌ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement